జీఎంఆర్ ఏరో టెక్నిక్తో.. ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఒప్పందం

జీఎంఆర్ ఏరో టెక్నిక్తో.. ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఒప్పందం

హైదరాబాద్: తమ బోయింగ్ 737 మ్యాక్స్​విమానాల బేస్ మెయింటనెన్స్​ సపోర్ట్​ కోసం ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫ్రేమ్ మెయింటెనెన్స్​, రిపెయిర్​, ఓవర్‌‌‌‌‌‌‌‌హాల్ (ఎంఆర్​ఓ) సంస్థ జీఎంఆర్​ ఏరో టెక్నిక్‌‌తో మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేశామని ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌ సోమవారం (జులై 07) ప్రకటించింది. 

ఒప్పందం ప్రకారం, జీఎంఆర్​ ఏరో టెక్నిక్ హైదరాబాద్ జీఎంఆర్​ ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌‌‌‌‌లోని దాని అత్యాధునిక ఎంఆర్​ఓ ఫెసిలిటీలో ఆకాశ ఎయిర్ విమానాలకు బేస్ మెయింటెన్స్​ చెకింగ్స్‌‌ను నిర్వహిస్తుందని జీఎంఆర్​ ఏరో టెక్నిక్ ​ప్రెసిడెంట్​అశోక్​ గోపీనాథ్​ చెప్పారు.