పాన్ ఇండియా మూవీగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’

పాన్ ఇండియా మూవీగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్టణ కేంద్రం. ఈ మూవీ ద్వారా జ‌బ‌ర్దస్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్నఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. 

న‌టీన‌టులు: శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన
సాంకేతిక వ‌ర్గం: 
బ్యాన‌ర్స్‌: మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి,  సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్షన్స్‌ 
నిర్మాత : ఎం.ఎం.అర్జున్‌
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం : స‌తీష్ బ‌త్తుల‌
కో ప్రొడ్యూస‌ర్స్‌:  విశ్వనాథ్‌.ఎం, హ‌రి కుమార్.జి, క‌మ‌ల్ మేడ‌గోని
సంగీతం : కార్తీక్‌ కొడ‌గండ్ల
పి.ఆర్.ఒ:  కుమార స్వామి వంగాల‌