ఇస్తాంబుల్ వద్దు పాతబస్తీని మంచిగ చేస్తే చాలు: అక్బరుద్దీన్ ఓవైసీ

ఇస్తాంబుల్ వద్దు పాతబస్తీని మంచిగ చేస్తే చాలు: అక్బరుద్దీన్ ఓవైసీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో అన్నీ చెబుతారు కానీ.. బయట నెరవేర్చరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల డబుల్ బెడ్ రూం కట్టి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అసలు ఆ హామీ ఎప్పుడు నెరవేరుతుందన్నారు. పాతబస్తీలో మెట్రో సంగతేమిటని ప్రశ్నించారు. మూసీని డెవలప్ చేస్తామన్నారు. కాని ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ వాదించారు. ఏవైతే చేస్తామని హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి అని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామన్న హామీని ఆయన గుర్తుచేశారు. ఇస్తాంబుల్ కాదు పాతబస్తీని అభివృద్ధి చేయండని అక్బరుద్దీన్ కోరారు. మరోవైపు నగరంలో క్రైమ్ రేటు పెరిగిపోతోందన్నారు. సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ సరిగా లేదని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినవాటికి.. రాష్ట్రంలో జరుగుతున్న దానికి సంబంధం లేదని అక్బరుద్దీన్ వాదించారు.