Akhil Next Film: ముహూర్తం షురూ చేస్తే తప్పితే..అఖిల్ సినిమాపై క్లారిటీ వచ్చేలా లేదు!

Akhil Next Film: ముహూర్తం షురూ చేస్తే తప్పితే..అఖిల్ సినిమాపై క్లారిటీ వచ్చేలా లేదు!

అక్కినేని అఖిల్ (Akhil Akkineni)ఏజెంట్ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావుస్తున్నా..ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే అయ్యగారి నెక్స్ట్ సినిమా గురించి చాలా రకాల వార్తలు వినిపించాయి.

సాహో సినిమాకు డైరెక్షన్ విభాగంలో పనిచేసిన అనిల్ కుమార్ అనే దర్శకుడు అఖిల్ కోసం ఒక భారీ  కథను సెట్ చేశాడని, పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను యూవీ,హోంబలే సంస్థలు నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యిందట.మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ లో సైలెంట్ గా ఈ సినిమా జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు..ఈ సినిమాలో అఖిల్ ధీర అనే యుద్ధవీరుడి పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాకు తారకసింహా రెడ్డి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

కానీ చూస్తుంటే ఇప్పట్లో అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.సినిమా ముహూర్తం షురూ చేస్తే తప్పితే.. మరో సినిమా మొదలైనట్లు అక్కినేని ఫ్యాన్స్ నమ్మేట్లే లేరు. అయితే, వచ్చే నెల (ఏప్రిల్ 8న) అఖిల్ బర్త్ డే వస్తుండటంతో అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఆరోజు రివీల్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 

ప్రస్తుతం అఖిల్ కు పాపం బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ స్టార్ ను కూడా చూడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓ మోస్తారు హిట్టు అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత సక్సెస్ ను కొనసాగించలేకపోయారు. ఇక భారీ అంచనాలు పెట్టుకుకున్న ఏజెంట్ కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అఖిల్ కెరీర్ మళ్ళీ డైలమాలో పడింది. నిజానికి ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అఖిల్ లో ఉన్నాయి కానీ, టైం కలిసిరావడం లేదు అంతే. ఒక్క హిట్టు.. ఒకేఒక్క హిట్టు పడితే మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయం అనే చెప్పాలి.