బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) కెనడా పౌరసత్వం వదులుకుని..భారత పౌరసత్వం(Indian Citizenship) లభించినట్లు ప్రకటించారు. ట్విట్టర్ లో అక్షయ్ భారత పౌరసత్వానికి సంబంధించిన అధికారిక పత్రాలను చూపిస్తూ ఫొటోస్ షేర్ చేశారు. ఇండిపెండెన్స్ రోజున ఈ గొప్ప విషయాన్నీ ప్రకటిస్తున్నందుకు గౌరవంగా ఉందంటూ.. దిల్ ఔర్ పౌరసత్వం, దోనో హిందుస్తానీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్! అంటూ ట్విట్టర్ లో పేర్కోన్నారు.
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. ఇన్నాళ్లు అక్షయ్ కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఎన్నో సార్లు కెనడా పౌరసత్వం వదులుకుంటా అని ప్రకటిస్తూ వస్తోన్న అక్షయ్..స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా కెనడా పౌరసత్వం రద్దు అయినట్లు పత్రాలు చూపించారు.
ఈ పత్రాల్లో ఎరుపు రంగు ఫోల్డర్‌పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్‌షిప్ అని ముద్రించి ఉంది. తన పేరును హైలైట్ చేసే పత్రాన్ని చూపించారు. దీంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ప్రౌడ్ ఫీలింగ్ తో హ్యాపీనెస్ ను సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అంతే కాకుండా ఈ పత్రాలలో అతని పేరు రాజీవ్ హరి ఓం భాటియా అని ఉంది. అలాగే అక్షయ్ పేరెంట్స్ హరి ఓం భాటియా, అరుణా భాటియా పేర్లతో పాటుగా అక్షయ్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా పేరు కూడా ఉంది. అలాగే తన గత పౌరసత్వం కెనడియన్ ఉండగా..పుట్టింది ఢీల్లీ అని పత్రాలలో పొందుపరిచారు.
అక్షయ్ కుమార్ కి 2011లో కెనడియన్ ఫెడరల్ ఎలెక్షన్స్ టైంలో కెనడా ప్రభుత్వం అక్షయ్‌కి కెనడియన్ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. అతడు కెనడాలోని అంటారియోలోని విండ్సర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. 2010లో ఎకనామిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ద్వంద్వ పౌరసత్వం ఉందని అక్షయ్ పేర్కొన్నారు.
ALSO READ :ఈ ఫొటో వెనక నిజం ఇదే : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను అమిత్ షా అవమానించారా..?
కాగా అక్షయ్ కుమార్ చాల సార్లు భారత పౌరసత్వంకు అప్లై చేసుకున్నారు. అలాగే కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని అనుకుంటున్నట్లు చాలా ఇంటర్వూస్ లో చెప్పినప్పటికీ ఎవ్వరు అంతగా నమ్మలేదు.దీంతో లేటెస్ట్ గా భారత పౌసత్వం లభించినట్లు అక్షయ్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ తో పాటు, ఇండియా వైడ్ గా ప్రముఖుల నుంచి వెల్కమ్ అంటూ..విషెష్ వస్తున్నాయి.
రీసెంట్ గా బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై గాడ్ (OMG) సినిమాకు సీక్వెల్ ఓ మై గాడ్-2 లో నటించి మెప్పించారు. ఫస్ట్ పార్టులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్..ఓ మై గాడ్-2లో శివుడిగా దర్శనమిచ్చి బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచారు.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! ?? pic.twitter.com/DLH0DtbGxk