ఈ ఫొటో వెనక నిజం ఇదే : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను అమిత్ షా అవమానించారా..?

ఈ ఫొటో వెనక నిజం ఇదే : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను అమిత్ షా అవమానించారా..?

కంటికి కనిపించని నిజం ఒకటి ఎప్పుడూ ఉంటుంది.. కళ్లకు కనిపించేది అంతా నిజం కాదు అనటానికి ఈ ఫొటోనే సాక్ష్యం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమిత్ షాతోపాటు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా – చంద్రచూడ్ కలిసిన సందర్భంలోని ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నమస్కారం పెడుతుంటే.. అమిత్ షా పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లు ఉంది. దీన్ని ప్రతిపక్షాలు కౌంటర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఫొటో వెనక వాస్తవం ఏంటీ.. దాని వెనక దాగి ఉన్న నిజం ఏంటీ అనేది డీటెయిల్డ్ గా చూద్దాం...

ALSO READ :ఇండియన్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో మంత్రి మల్లారెడ్డి.. విజనరీ మ్యాన్ అవార్డ్ సొంతం

ఫోటోలో ఏముంది...

ఢిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల్లో పాల్గొనేందుకు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపై కూర్చున్నారు. ఈ సమయంలో వేదికపైకి వచ్చిన డివై చంద్రచూడ్ అమిత్ షాకు నమస్కారం చేశారు. కానీ అమిత్ షా మాత్రం చంద్రచూడ్ ను పట్టించుకోలేదు...అన్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా అమిత్ షాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఒక్క ఫోటో ఆధారంగా నెటిజన్లు, ఇతర పార్టీల నేతలు అమిత్ షాపై మండిపడుతున్నారు.  కానీ అసలు విషయం మరో విధంగా ఉంది. 

అసలు నిజం ఏంటంటే...

ఫోటోలో చూస్తే మాత్రం అమిత్ షా చంద్రచూడ్ ను పట్టించుకోలేదన్నట్లుగా ఉంది. కానీ వీడియో చూస్తే అసలు నిజం ఏంటో తెలుస్తుంది. ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు  సీజేఐ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. అప్పటికే వేదికపై కూర్చున్న అమిత్ షా..చంద్రచూడ్ కు స్వాగతం పలికేందుకు తన కుర్చో నుంచి లేచారు. అమిత్ షాతో పాటు..ఆయన భార్య  సోనాల్ కూడా లేచినిలబడ్డారు. ఈ సమయంలో అమిత్ షా చంద్రచూడ్ దగ్గరకు వెళ్లి  నమస్కరించారు. కరచాలనం చేస్తూ ఆహ్వానించారు. ఆ తర్వాత తన కూర్చీ దగ్గరకు వచ్చేందుకు వెనుదిరిగారు.  అక్కడే ఉన్న అమిత్ షా భార్యకు  సీజేఐ డీవై చంద్రచూడ్ నమస్కారం చేశారు.  అయితే చంద్రచూడ్ నమస్కరిస్తున్నప్పుడు అమిత్ షా తన కుర్చీ వైపు చూస్తున్నారు. దీంతో అమిత్ షా చంద్రచూడ్ ను అవమానించారంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ  ఫోటోను పోస్ట్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అయింది.