ఇండియన్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో మంత్రి మల్లారెడ్డి.. విజనరీ మ్యాన్ అవార్డ్ సొంతం

ఇండియన్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో మంత్రి మల్లారెడ్డి.. విజనరీ మ్యాన్ అవార్డ్ సొంతం

మంత్రి మల్లారెడ్డి ఓ రికార్డు సాధించారు. మంత్రి మల్లారెడ్డి ఇండియన్​ బుక్ ​ఆఫ్ ​రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. ఆయన కృషికి విజనరీ మ్యాన్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడంపై మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  కష్టపడితే ఎంతటి విజయాన్నైనా  సాధించవచ్చు అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తన విజయానికి ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని. చెప్పుకొచ్చారు. 

పాలు అమ్మినా..పూలు అమ్మినా..

అంతేకాదు మంత్రి మల్లారెడ్డి తన ఫేమస్ డైలాగ్ ను మరోసారి చెప్పారు. పాలు అమ్మినా.. పూలు అమ్మినా అంటూ తెలిపారు. కాలేజీలు స్థాపించి.. ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లను, ఇంజినీర్లను తయారు చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.  

ప్రజల ఆశీర్వాదం వల్లే  జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని.. ఇక మిగిలిన జీవితమంతా.. ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తానని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో మంత్రి మల్లారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.