
కరోనా టైమ్‌లోనూ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నాడు అక్షయ్ కుమార్. ఇటీవల ‘సూర్యవంశీ’ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన అక్షయ్ చేతిలో ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలున్నాయి. వాటిలో ఆనంద్ ఎల్ రాయ్ రూపొందిస్తున్న ‘రక్షాబంధన్’ కూడా ఒకటి. ‘అత్‌రంగీ రే’ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 11న రాఖీ పౌర్ణమి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై రీసెంట్‌గా ఆనంద్ ఎల్ రాయ్ రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ అవుతుందని, డేట్‌లోనూ ఎలాంటి మార్పూ లేదని చెప్పారు. అన్నాచెల్లళ్ల అనుబంధం, రక్షా బంధన్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ను ఈ చిత్రం తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని అన్నారు రాయ్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్ ఎల్ రాయ్, ఆల్కా హీరానందానీ నిర్మిస్తున్నారు.