'రక్షా బంధన్'... ఆన్ స్క్రీన్ సిస్టర్స్ తో అక్షయ్ ఫొటో షూట్

'రక్షా బంధన్'... ఆన్ స్క్రీన్ సిస్టర్స్ తో అక్షయ్ ఫొటో షూట్

అక్షయ్ కుమార్ తాజాగా నటించిన ‘రక్షా బంధన్‌’ సినిమా ఆగష్టు 11న విడుదల కానుంది. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శక‌త్వం వహిస్తోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో భూమి పెడ్నేక‌ర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నారు. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం అరుదైన రికార్డులను ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించి స్టార్ హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ షూట్ లో పాల్గొన్నారు. ఈ షూట్ లో అక్షయ్ కుమార్, దీపికా కన్నా, స్మృతి శ్రీకాంత్, సహేజ్ మీన్ కౌర్, సాధియా ఖతీబ్, డైరెక్టర్ ఆనంద్. ఎల్.రాయ్ కూడా పాల్గొని, ఫొటోలకు ఫోజిచ్చారు. ఇదిలా ఉండగా జీస్టూడియోస్, క‌ల‌ర్ యెల్లో ప్రొడ‌క్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ బ్యాన‌ర్లపై ఆ సినిమా సంయుక్తంగా తెర‌కెక్కుతోంది. కాగా ఈ మూవీలో సాహెజ్ మీన్ కౌర్‌, దీపికా ఖ‌న్నా, స‌దియా ఖ‌తీబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

కాగా అక్షయ్ నటించిన రక్షా బంధన్ సినిమాతో పాటు, మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా కూడా ఆగష్టు 11నే విడుదల కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజా అక్షయ్ మూవీ రక్షా బంధన్ కూ ఆ నిరసన సెగ అంటుకుంది. ఆ సినిమానూ నిషేధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.