
వంగూరు, వెలుగు : సర్కార్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని వంగూరు, పోల్కంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను బుధవారం కమిషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు ఎస్‌ఎంసీ కమిటీలు పనిచేయాలని సూచించారు. అనంతరం కమిటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట చారకొండ వెంకటేశ్, విఘ్నేశ్వరరావు, టీచర్లు కొలుకులపల్లి లింగమయ్య ఉన్నారు.