డల్లాస్ ఘర్షణలో..

డల్లాస్ ఘర్షణలో..

‘విహారి’ పేరుతో పదిహేనేళ్లుగా ట్రావెల్‌‌ షో నిర్వహిస్తున్న ఎ.ఎల్. నితిన్‌‌ కుమార్, ‘మయూఖి’ పేరుతో ఓ సినిమాని రూపొందించారు. ‘డల్లాస్ ఘర్షణలో’ అనేది క్యాప్షన్. రోని, మయూఖి, వాసుకి ప్రధాన పాత్రలు పోషించారు. నంద కిషోర్, డి.టెరెన్స్ నిర్మాతలు. నిన్న ప్రసాద్ ల్యాబ్స్‌‌లో ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను లాంచ్ చేశారు. ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి ముఖ్య​అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలంటూ విషెస్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రెండు మాఫియా గ్రూపుల మధ్య చిక్కుకున్న తన మేనకోడలిని హీరో ఎలా కాపాడాడనేది ప్రధానాంశం. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్‌‌ మూవీ. షూటింగ్ మొత్తం అమెరికాలో చేశాం. అక్కడ స్థిరపడ్డ భారతీయులు నటించారు. త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. ‘డిఫరెంట్‌‌ స్టోరీలైన్‌‌తో సెంటిమెంట్, సస్పెన్స్ కలగలిసిన యాక్షన్ డ్రామా ఇది. కొత్త డల్లాస్‌‌ను చూస్తారు’ అన్నాడు రోని. మయూఖి, వాసుకి,  రచయిత గణపతి రామం తదితరులు పాల్గొన్నారు.