అలా నిన్ను చేరి మూవీ..యూత్‌‌ ఫుల్‌‌ లవ్‌‌ స్టోరీ : దినేష్

అలా నిన్ను చేరి మూవీ..యూత్‌‌ ఫుల్‌‌ లవ్‌‌ స్టోరీ : దినేష్

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌‌లో మారేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో జరిగింది. బెక్కెం వేణు గోపాల్,  త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. దినేష్ మాట్లాడుతూ ‘ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ప్రేక్షకులకు ఓ మంచి జ్ఞాపకంగా ఉంటుంది’ అన్నాడు.

‘ఇదొక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌‌. అండర్ కరెంట్‌‌గా మెసేజ్ కూడా ఉంది’ అన్నారు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘స్క్రీన్ ప్లే అద్భుతంగా కుదిరింది. థియేటర్ నుంచి వచ్చాక ఓ రెండు గంటల పాటు అదే ట్రాన్స్‌‌లో ఉంటారు’ అని చెప్పాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, కెమెరామెన్ ఆండ్రూ, మ్యూజిక్ డైరెక్టర్ సుభాస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.