అలయ్​ బలయ్​ సంబురం

అలయ్​ బలయ్​ సంబురం
  • అలయ్​ బలయ్​ సంబురం
  • బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో నిర్వహణ
  • హాజరైన నాలుగు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు
  • దసరా పేరుతో అందరిని ఒకే వేదికపై రావడం శుభపరిణామమని వ్యాఖ్య

హైదరాబాద్ : హిందూ సంప్రదాయాలకు ప్రతీక ఆలయ్​ బలయ్ ​కార్యక్రమం అని ప్రముఖులు కొనియాడారు. బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో అలయ్​ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి,  మురళీధరన్,  కిషన్​రెడ్డి, హిమాచల్​ప్రదేశ్ ​గవర్నర్​ బండారు దత్తాత్రేయ, మిజోరాం గవర్నర్ హరిబాబు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రాత్,  జార్ఖండ్ గవర్నర్ రాధాకిషన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ , సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ ఎంపీ కె కేశవ రావు, మాజీ ఎంపీలు వివేక్​వెంకటస్వామి, బూర నర్సయ్య గౌడ్, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి,  రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 

హిందూ సంప్రదాయాలకు ప్రతీక 

ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ దసరా తర్వాత గత 17 ఏండ్లుగా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. అలయ్– బలయ్ లేకుండా హైదరాబాద్ లో దసరా పూర్తి అయినట్టు కాదు.  తెలంగాణ వంటకాలను దత్తాత్రేయ గత 17 ఏండ్లుగా అందిస్తున్నారు’ అని కిషన్​రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ దసరా పేరుతో అందరిని ఒకే వేదికపై తీసుక వస్తున్నారు. రాజకీయాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా ఇక్కడికి వస్తున్నారు. ఉద్యమంలో అందరిని ఏకం చేసింది ఈ కార్యక్రమం’ అని చెప్పారు. మిజోరం గవర్నర్  హరిబాబు మాట్లాడుతూ దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దసరా జరుపుకుంటున్నారు. సమాజంలో అన్ని వర్గాల వారిని ఒకే వేదిక మీదకు తీసుకవస్తున్నారు. అలయ్–బలయ్ అంటే గుర్తు వచ్చేది దత్తాత్రేయ’ అని అన్నారు.