భక్తులకు అలర్ట్: తిరుమల కాలి నడక మార్గంలో పులి.. భద్రతను సమీక్షించిన అదనపు ఈవో

భక్తులకు అలర్ట్: తిరుమల కాలి నడక మార్గంలో పులి.. భద్రతను సమీక్షించిన అదనపు ఈవో

తిరుమల కానిడకన వెళ్లే మార్గంలో ఈ మధ్య పులల సంచారం ఎక్కువైంది. ఇప్పటికే పలుమార్లు చిరుత పులులు కంటపడటం.. టీటీడీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సారి నడక మార్గంలో పులి తిరుగుతుండటం భక్తులన ఆందోళనకు గురి చేసింది. 

దీంతో టీటీడీ ఈవో స్వయంగా అలిపిరి కాలినడక మార్గాన్ని పరిశీలించారు. బుధవారం (మే 28) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ఏడవ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని టీటీడీ అద‌నపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి త‌నిఖీ చేశారు. టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. న‌డ‌క‌దారిలో ఏర్పాటు చేసి ఉన్న స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు.

►ALSO READ | టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబునే : 30 ఏళ్లుగా కొనసాగుతూ సరికొత్త రికార్డ్

అటవీ ప్రాంతంలో మానవ–వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కొనడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ నిఘా వీజీవో శ్రీ రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి శ్రీ దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీ మధుసూదన్ ఇత‌ర  అధికారులు పాల్గొన్నారు.