టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబునే : 30 ఏళ్లుగా కొనసాగుతూ సరికొత్త రికార్డ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబునే : 30 ఏళ్లుగా కొనసాగుతూ సరికొత్త రికార్డ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా చంద్రబాబుతో వర్లరామయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. 30 ఏళ్లుగా చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మొదటి సారి 1995లో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహిస్తారు.  

ALSO READ | ఎన్టీఆర్ ఏఐ వీడియో: భళా లోకేష్ మనవడా అంటూ పొగడ్తలు

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఈ అంశంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తామెప్పుడు అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు. ఏపీలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే తన ఆశయం అన్నారు. నది జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రం అని..  నదుల అనుసంధానంతో తెలంగాణకు కూడా లాభమేనన్నారు. 

ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచబోమన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వమే కరెంట్ ఛార్జీలు పెంచి తమపై నిందలు వేస్తోందన్నారు. కడప మహానాడు తనకు ప్రత్యేకమైనదన్నారు.