కరీంనగర్ అల్ఫోర్స్ లో టీచర్స్ ట్రైనింగ్

కరీంనగర్ అల్ఫోర్స్ లో టీచర్స్ ట్రైనింగ్

కరీంనగర్ టౌన్,వెలుగు:  భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ లో ఆదివారం  అల్ఫోర్స్ , లయన్స్ క్లబ్ ఆఫ్​ కరీంనగర్ శాతవాహన  ఆధ్వర్యంలో   ఉపాధ్యాయుల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ  చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో టీచర్ల పాత్ర  చాలా ఆదర్శనీయమన్నారు.

సమాజాభివృద్ధికి టీచర్లు  ఎంతో దోహదపడతారని వెల్లడించారు.  అనంతరం నరేందర్ రెడ్డిని టీచర్లు  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  యాదగిరి శేఖర్ రావు, బుర్ర మధుసూధన్ రెడ్డి, రాజిరెడ్డి,శివప్రసాద్, ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.