బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ టైంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. అందంతోపాటు నటనతో యాక్షన్ పెర్ఫార్మన్స్తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
హిందీలో వరుస సినిమాలు చేస్తూ.. నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న అలియా భట్.. తెలుగులో రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా సీత పాత్రతో ప్రేక్షకులను పలకరించింది. కెరీర్ పీక్ టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో అలియా ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం అదే ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అలా అటు ఫిల్మ్ కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్తో బిజీగా ఉన్న అలియా, రణపూర్ దంపతులు అభిమానులతో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను December 5 అలియా తన ఇన్ స్ట్రాలో పంచుకుంది.
'కృష్ణరాజ్' పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ భవనం సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు. ఇక అలియా భట్ సినిమాల విషయాని కి వస్తే.. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన రోడ్ డ్రామా జీ లే జరా తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. రణబీర్ "రామాయణ" సినిమాతో బిజీగా ఉన్నారు.
