
ఇన్ఫోసిస్ భారత ఐటీ సేవర రంగంలో రెండవ అతిపెద్ద సంస్థ. ఇన్ఫోసిస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నారాణయ మూర్తి. అయితే ఏఐ విప్లవంలో కంపెనీ ముందు వరుసలో నివటాన్ని ఆయన ఆలోచనలే అడ్డుకున్న విషయం తాజాగా మీనల్ గోయల్ అనే సీఏ బయటపెట్టడంతో వార్తల్లో ప్రధాన అంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే 2015 సమయంలో కంపెనీ సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ ను ఏఐ ఫస్ట్ కంపెనీగా మార్చాలనుకున్నారు. దీంతో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సామర్థ్యాలను పొందటానికి ఓపెన్ఏఐ సంస్థలో బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8వేల500 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధం అయ్యారు. ఆ సమయంలో సిలికాన్ వ్యాలీలోని అమెజాన్, టెస్లా లాంటి కంపెనీలతో కలిసి ఈ పెట్టుబడి చేయాల్సి ఉంది. కానీ సిక్కా ఆలోచనలు నారాయణమూర్తి పాతకాలపు ఆలోచనల ముందు ముందుకు సాగలేదు.
భవిష్యత్తు టెక్నాలజీలపై పెట్టుబడి రిస్క్ అని భావించిన మూర్తి వాదనలతో సిక్కా ఏకీభవించలేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలతో మిగిలిపోయిన మూర్తి కారణంగా ఓపెన్ ఏఐలో పెట్టిన బిలియన్ డాలర్ పెట్టుబడిని ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేసిన స్వల్ప కాలంలోనే వెనక్కి తీసుకుంది. దీంతో వచ్చిన విభేదాలతో విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసి ఇన్ఫోసిస్ కంపెనీని వీడారు. కానీ ఆరోజు ఇన్ఫోసిస్ ఓపెన్ ఏఐలో తన ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడిని అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం దాని మార్కెట్ విలువ 45 బిలియన్ డాలర్లకు చేరుకుని ఉండేది.
ALSO READ : కొత్త కార్లే తక్కువకు వస్తుంటే..
భారత ఐటీ రంగం పెద్దగా ఇబ్బందులు లేకుండా కొనసాగటంతో ఏఐని ముందుగానే అందిపుచ్చుకోవాల్సిన ఇన్ఫోసిస్ తన పాత వ్యాపార ఆలోచనలలోనే మిగిలిపోయింది. ఆ తర్వాత విశాల్ సిక్కా ఓపెన్ఏఐ సంస్థలో అడ్వైజరుగా పనిచేశారు. సిక్కా మాట మూర్తి విని ఉంటే కంపెనీ పరిస్థితి ఏఐని అందిపుచ్చుకోవటంలో వేరే స్థాయిలో ఉండేదనే వాదనలు ఉన్నాయి. దాదాపు దశాబ్ధకాలం కిందటే సిక్కా ముందుచూపుతో ఉన్నప్పటికీ.. మూర్తి మాత్రం స్టాక్ బైబ్యాక్ అంటూ మరోదారిలో కొనసాగారు. ఇక్కడ ఇన్ఫోసిస్ తన అదనపు నిధులను భవిష్యత్తు ఏఐ టెక్నాలజీపై పెట్టి ఉంటే గ్లోబల్ ఏఐ రేసులో ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్ తిరుగులేని ఆధిపత్య స్థాయికి చేరుకుని ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.