
హైదరాబాద్, వెలుగు: ఎలివ్ డైమండ్స్ బ్రాండ్ హైదరాబాద్‌లో మొట్టమొదటి షోరూంను ప్రారంభించింది. తిబారుమల్ జ్యువెల్స్‌కు చెందిన ఈ ప్రీమియం డైమండ్ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ షోరూం కోకాపేటలో మొదలయింది. మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కశ్వి, మిసెస్ ఇండియా 2024 డాక్టర్ ప్రీతి అడుసుమిల్లి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో 'చార్మినార్ కలెక్షన్' ఆవిష్కరించారు. ఇందులోని ప్రతి నగనూ హస్తకళతో తయారు చేశామని ఎలివ్ పేర్కొంది. భవిష్యత్‌లో బంజారాహిల్స్, కొంపల్లి, వరంగల్, కోయంబత్తూర్తోపాటు అమెరికాలో స్టోర్లను ఏర్పాటు చేస్తామని ఎలివ్ డైమండ్స్ వెల్లడించింది.