ఖరీదైన అపార్ట్‌మెంట్లు.. సెకన్ల వ్యవధిలో కూల్చేశారు: వీడియో

ఖరీదైన అపార్ట్‌మెంట్లు.. సెకన్ల వ్యవధిలో కూల్చేశారు: వీడియో

నిబంధనలకు విరుద్ధంగా కేరళ రాష్ట్రం కొచ్చిలోని సరస్సుల వద్ద నిర్మించిన మరాదు అపార్ట్ మెంట్లను అధికారులు ఆదివారం కూల్చేశారు.  శనివారం రెండు అపార్ట్ మెంట్లు కూల్చేసిన అధికారులు.. ఆదివారం మరో రెండు అపార్ట్ మెంట్లను కూల్చేశారు. సరస్సు తీరంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కూల్చివేతలకు ఆదేశించింది.  ఆదివారం మధ్యాహ్నం 17 అంతస్తుల “గోల్డెన్ కయలోరం”  అపార్ట్‌మెంట్ ను మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కూల్చివేశారు. ఈ ఖరీదైన అపార్ట్‌మెంట్ల కూల్చివేతలను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.