బీఆర్ఎస్​​ నేతలంతా ‘బలగం’లా ఉండాలె : శ్రీనివాస్​గౌడ్

బీఆర్ఎస్​​ నేతలంతా ‘బలగం’లా ఉండాలె : శ్రీనివాస్​గౌడ్

హన్వాడ, వెలుగు: బీఆర్ఎస్​​ నేతలంతా బలగంగా ఏర్పడితేనే పాలమూరును మరింత అభివృద్ధి  చేసుకోవచ్చని ఎక్సైజ్​ శాఖ మంత్రి వి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. హన్వాడ మండలం కొత్తపేట సమీపంలోని దాచక్​పల్లి స్టేజ్​ వద్ద సోమవారం బీఆర్ఎస్  ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబ్బు శాశ్వతం కాదని, మనం చేసే మంచే శాశ్వతంగా ఉంటుందన్నారు. కలిసిమెలిసి, ఆత్మీయంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

సమ్మేళనం ముగిసిన తరువాత పార్టీ జిల్లా, మండల స్థాయి లీడర్లు, కార్యకర్తలను రెండు జట్లుగా విభజించి వారితో కలిసి కబడ్డీ ఆడారు. రైడింగ్ కోసం వచ్చిన ఓ లీడర్​ను మంత్రి ఒడిసి పట్టేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయలక్ష్మి పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని వెంకటమ్మకుంట తండాలో రూ.20 లక్షలతో చేపట్టిన  గ్రామపంచాయతీ బిల్డింగ్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి పట్టణంలోని వక్ఫ్  కాంప్లెక్స్  ఆఫీసులో జరిగిన వక్ఫ్  కాంప్లెక్స్  కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. ఇఫ్తార్  విందులో మంత్రి పాల్గొన్నారు.