బెంగళూరు: ఆలిండియా ఎల్‌ఐసీ గేమ్స్ 2026–27 కర్నాటక రాజధాని బెంగళూరు శ్రీ కంఠీరవ స్టేడియంలో ఆరంభమయ్యాయి. ఎల్‌ఐసీ సీఈఓ దొరైస్వామి సోమవారం ఈ పోటీలను ప్రారంభించారు. ఈ నాలుగు రోజుల టోర్నమెంట్లో క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.
ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ.. గేమ్స్ కేవలం పోటీకి మాత్రమే పరిమితం కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో, క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ క్రీడల్లో కార్పొరేషన్‌కు చెందిన ఎనిమిది జోన్‌ల నుంచి సుమారు 376 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఎల్‌ఐసీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
