ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌.. రన్నరప్‌‌‌‌‌‌‌‌ రాఘవ్ శ్రీవాస్తవ్

ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌..  రన్నరప్‌‌‌‌‌‌‌‌ రాఘవ్ శ్రీవాస్తవ్

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ఆటగాడు వి. రాఘవ్ శ్రీవాస్తవ్ రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.- ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్, టాప్ సీడ్ ఎండి ఇమ్రాన్ టైటిల్ నెగ్గాడు.  

ఇమ్రాన్ 9 రౌండ్లలో 8.5 పాయింట్లతో  ట్రోఫీ అందుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో అతను తమిళనాడుకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ఎం. చక్రవర్తి రెడ్డితో గేమ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్‌‌‌‌‌‌‌‌లో తమిళనాడు ఆటగాడు శైలేష్‌‌‌‌‌‌‌‌పై నెగ్గిన  రాఘవ్ శ్రీవాస్తవ్ మొత్తం 8 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

  టి.ఎం. అభిషేక్ (తమిళనాడు) కూడా 8 పాయింట్లు సాధించి మూడో స్థానం దక్కించుకున్నాడు. విన్నర్లకు ద్రోణాచార్య అవార్డీ కోనేరు అశోక్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ  పి. మల్లారెడ్డి, కేఎస్ ప్రసాద్ ట్రోఫీలు
 అందజేశారు.