కాఫీపే చర్చా.. సోషల్ మీడియాలో వైరల్

కాఫీపే చర్చా.. సోషల్ మీడియాలో వైరల్

ఆస్ట్రేలియాలో కాఫీపే చర్చా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన రిక్ ఎవెరెట్ అనే వ్యక్తి ఇంటి వెనుక భాగంలో కాఫీ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాఫీ పే చర్చా అంటే అందరూ కూర్చొనే ముచ్చట్లు పెట్టేందుకు కాదు. ఎవరైనా కాఫీ తాగాలనుకుంటే అతను అరేంజ్ చేసిన ఫ్లేస్ లో కాఫీ తాగి వెళ్లి పోవచ్చు. ఇందంతా ఎందుకంటే రిక్ ఎవెరెట్ లాక్ డౌన్ తో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీంతో ఇంట్లో ఉండి అన్నీ రకాల వంటలు, కాఫీ ఎలా పెట్టాలో నేర్చుకొని తనవంతు సాయంగా సమాజ సేవ చేయాలని అనుకున్నాడు.

ఇంటి వెనుక భాగాన్ని చిన్న ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో అందంగా డిజైన్ చేశాడు. అక్కడ ఓ బోర్డ్ పెట్టి అటువైపుగా వెళుతున్న స్థానికులకు ఉచితంగా కాఫీని అందిస్తున్నాడు. ఆ కాఫీ తాగేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలి.

అంతేకాదు అక్కడ వైరస్ ను ఎదుర్కొనే కాఫీ అంటూ ఓ సైన్ బోర్డ్ ను తగిలించాడు. ఆ బోర్డ్ లో నేను ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం లేదు, నేను ఏ వ్యాపారాన్ని ప్రారంభించడం లేదు. మీ సహచరుల ఇంటివెళ్లి కాఫీ తాగుతున్నట్లు ఫీలవ్వండి. అందుకు మీరిచ్చే బహుమతి ఓ చిరునవ్వు మాత్రమే.

ఇతని గురించి తెలుసుకున్న స్థానికులు తమకు తోచినట్లుగా వైన్, టీ, కాఫీ, ఆహరపదార్ధాల్ని అక్కడికి తెచ్చిపెడుతున్నారు.ఈ సందర్భంగా ఎవెరెట్ మాట్లాడుతూ నేను పెట్టిన కాఫీ పే చర్చకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. చాలా మంది నాఇంటికి వచ్చి బెల్ కొడుతున్నారు. కాఫీ తాగేందుకు కాదు. నేను చెప్పే మాటల్ని విని సంతోషిస్తున్నారని అన్నారు.