ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పిట్లం, వెలుగు: మండలంలో చెరువుల కబ్బాలను అడ్డుకోవాలని ఇరిగేషన్​ ఆఫీసర్లపై  మండల సర్వ సభ్య సమావేశంలో సీరియస్​ అయ్యారు.  ఎంపీపీ కవితావిజయ్​ అధ్యక్షతన గురువారం ఈ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. మండలంలో రాంపూర్​, అన్నారం పెద్ద చెరువును కబ్జా చేసి బోర్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదని  తెలిపారు. పిట్లం ఊర చెరువు అభివృద్ధికి రూ. నాలుగు లక్షల అంచనాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. గతంలో రూ. 15 లక్షలుమంజూరు చేసినా పనులు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల మీటింగ్​ ఉందని సమాచారం ఇచ్చినా..  మూడు నెలల ప్రగతి నివేదికను కూడా పంపించ లేదని ఎంపీపీ కవిత ఏఈఈని ప్రశ్నించారు.   ఇరిగేషన్​ డీఈఈ పిట్లం మండల కేంద్రంలో ఉండాలని, ఎందుకు ఉండడం లేదని చిన్నకొడప్​గల్​ ఎంపీటీసీ వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా సరియైన సమాధానం చెప్పక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ ​ చెక్కులను లబ్దిదారులకు ఎంపీపీ కవిత అందజేశారు. ఈ కార్యక్రమంలోవైస్​ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్​ రామ్మోహన్​రావు, రైతు సమన్వయ సమితి మండల ప్రెసిడెంట్​ దేవెందర్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి ఫండ్స్​ ఇవ్వండి

కామారెడ్డి , వెలుగు :  కామారెడ్డి  జిల్లా  అభివృద్ధికి  ఫండ్స్​ ఇవ్వాలని  సీఎం కేసీఆర్​ను స్థానిక లీడర్లు  కోరారు.  డిల్లీలో  గురువారం సీఎం కేసీఆర్​ను  కలిశారు.   ఫండ్స్​, డెవలప్​మెంట్​ వర్క్స్​పై చర్చించారు. స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి,   ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​,  ఎమ్మెల్యేలు  హన్మంతుషిండే, జాజాల సురేందర్​,   స్టేట్​ ఉర్ధు ఆకాడమి ఛైర్మన్​ ఎం.కె.ముజీబుద్ధీన్​,  డీసీసీబీ చైర్మన్​  పోచారం భాస్కర్​రెడ్డి,  లీడర్లు సురేంధర్​రెడ్డి,  దఫేదర్​ రాజు ఉన్నారు. 

నెలాఖరులోగా పనులను కంప్లీట్​ చేయాలి

లింగంపేట, వెలుగు: ‘మన ఊరు - మనబడి’   పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని   కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు.  మండలంలోని  సురాయిపల్లితండా, పోతాయిపల్లి ప్రైమరీ స్కూళ్లను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా   కలెక్టర్​ మాట్లాడు తూ...  జిల్లాలో 351 పాఠశాలలను  ఎంపిక చేయ గా లింగంపేట మండలంలో 27 పాఠశాలు ఉన్నాయని, సురాయిపల్లి తండాస్కూల్​ కు రూ.7.41 లక్షలు, పోతాయిపల్లి ప్రైమరీ స్కూల్​కు రూ. 7.78 లక్షలు  మంజూరైనట్లు చెప్పారు.   నిధుల కొరత లేదని ,   పనులు చేస్తూ విడతల వారిగా బిల్లులు పొందవచ్చని చెప్పారు.​  కలెక్టర్​ వెంట డీఈఓ రాజు, ఎంఈఓ రామస్వామి, డీఈ నారాయణ, ఎంపీడీఓ నారాయణ, సర్పంచ్​ రాజశేఖర్​రెడ్డి, హెచ్​ఎం దామోదర్​, సెక్రటరీ శివకుమార్​  తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్, (ఎల్లారెడ్డి)  : దళిత బంధు పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ సూచించారు.  గురువారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో దళిత బంధు యూనిట్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం నిజాంసాగర్ తహసీల్దార్ ఆఫీస్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా ఆఫీసర్లకు పల్లె ప్రగతి,తదితర పనులపై సమీక్షనిర్వహించారు. ఈ కార్యక్రమంలో   వెటర్నరీ ఆపీసర్ భారత్,ఎంపీడీఓ నాగేశ్వర్,సర్పంచ్ అనసూయ,సెక్రెటరీ గంగారాం  పాల్గొన్నారు.

ఘనంగా మధుయాష్కీ పుట్టిన రోజు

నిజామాబాద్​ రూరల్​, వెలుగు:  వచ్చే ఎన్నికల్లో కాగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని కాంగ్రెస్​ నిజామాబాద్​ ఎస్టీ సెల్​ జిల్లాధ్యక్షుడు యాదగిరి అన్నారు.  పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీగౌడ్​ జన్మదిన వేడుకలను నగరంలోని గ్రేసీ ఫౌండేషన్​ వారి బధిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఈ పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, పుస్తకాలను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు రవి, నాయకులు సుభాష్​, దయాకర్​గౌడ్​, రవినాయక్​, సతీశ్​​ తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది

నిజామాబాద్, వెలుగు:   పాత  కలెక్టర్ ఆఫీస్​ కాంప్లెక్స్​, మినీ స్టేడియాలను , ఇతర ప్రభు త్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించొద్దని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా  నగర కమిటీ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.  ఆ సంఘం కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షతన గురువారం  రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం, జిల్లాలోని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి ప్రభుత్వ స్థలాలతో  వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి గుండెకాయ లాంటి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, సీపీ క్యాంప్ కార్యాలయం, జిల్లా క్రీడా మైదానం, పోలీసు పరేడ్ గ్రౌండ్,  ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన 20 ఎకరాలకు పైగా  స్థలంపై అధికార పార్టీ నేతల కళ్ళు పడ్డాయన్నారు.  ఈ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు చేస్తే ప్రజలందరిని సమీకరించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు.  ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నాయకులు వనమాల కృష్ణ,  పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, ఒలంపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య,  సీపీ ఎం, సీపీఐ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ట్రాన్స్​ఫార్మర్లు దొంగతనం చేస్తున్న ఇద్దరి అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: జిల్లాలో ట్రాన్స్​ ఫార్మర్లను దొంగతనం చేస్తున్న ఇద్దరిని ఇద్దరిని అరెస్ట్​ చేసినట్టు  పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు.  నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన  కుతడి లింగం (27) కుతడి దేవేందర్( 27)   సంవత్సర కాలంలో 31 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, ఒక టెంపుల్ లో 10 గ్రాముల   మంగళసూత్రం,  వైన్ షాపు చోరి   తదితర 33 దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి  రూ. ఆరు లక్షల విలువ చేసే 195 కిలోల రాగి వైరు, 10 గ్రాముల పుస్తెలు, టీవీఎస్ ఎక్సెల్, ట్రాన్స్​ఫార్మర్లను స్వాధీనం చేసుకున్నారు.  మరో ముగ్గురు నిందితులను  త్వరలోనే పట్టుకుంటామన్నారు.  ఈ సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సీసీఎస్ ఏసీపీపి రమేశ్​, ఇన్స్పెక్టర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.  

జ్యోతి బాపూలే,  సావిత్రిబాయికి  భారతరత్న నివ్వాలి

మోర్తాడ్ వెలుగు: మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేకు భారతరత్న  ఇవ్వాలని, మోర్తాడ్ మండల కేంద్రంలో దలిత సంఘాలు  తహసీల్దార్​ బావయ్య కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశంలోని పేదలకు చదువు చెప్పేందుకు సత్య శోధక్ స్కూల్ స్థాపించి జ్ఞానం తోప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించిన మేధావులన్నారు. వారికి భారత రత్న అవార్డు ఇచ్చి,  వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని డిమాండ్​ చేశారు.  ఈ కార్యక్రమంలో మండల దళిత సంఘ సభ్యులు మల్లూరి రాజారాం, గంధంమహిపాల్, బాబూరావు, మామిడి రవి  పాల్గొన్నారు.