రాజస్థాన్ లో వానలు..విద్యా సంస్థలకు సెలవులు

రాజస్థాన్ లో వానలు..విద్యా సంస్థలకు సెలవులు

 రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జైత్ సాగర్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం వరకు విద్యాసంస్థలకు  అధికారులు సెలవుల ప్రకటించారు. వానలు బీభత్సం సృష్టించడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అరడజను ఇళ్లు కూలిపోయాయి. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  బిసల్‌పూర్ డ్యామ్ నీటిమట్టం 12 గంటల్లో 7 సెంటీమీటర్లు పెరిగింది. 

కోటా బ్యారేజీ  14 గేట్లు ఎత్తి దాదాపు 4 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం ఎక్కువకావడంతో మరో ఐదు గేట్ల ద్వారా నీటిని కిందకు వదులుతామని చెప్పారు.