దసరా అయిపోయింది.. మరి దీపావళి సెలవు ఎప్పుడు..?

దసరా అయిపోయింది.. మరి దీపావళి సెలవు ఎప్పుడు..?

దేశవ్యాప్తంగా దీపావళి  పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా బంధువులు సన్నిహితులకు కానుకలను పంపిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.అలాగే టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

దీపావళి పండగకు ఆశ్వయుజ  బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ  నవంబర్‌ 12నే  జరుపుకోవాలని పంచాగకర్తలు  అంటున్నారు.  మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో  నవంబర్‌ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు.

దీపావళి పండుగ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినరోజని భావించి అమ్మవారికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేసుకుంటారు.ఇలా నరకాసురుడి వధ తర్వాత దీపావళి పండుగను జరుపుకుంటారు.  అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, దీపావళి పండుగ జరుపుకోవడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే. ... ప్రతి ఏడాది దీపావళి పండుగ కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 12 వ తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.నవంబర్ 12 వ తేదీ చతుర్దశి మధ్యాహ్నం 1.53 నిమిషాలకు ఉంటుంది.  అదే రోజు  ఆ తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది.అమావాస్య నవంబర్ 13 వ తేదీ మద్యాహ్నం  2:56 వరకు ఉంటుంది.పురాణాల ప్రకారం  అమావాస్య తిథిని రాత్రి వేళ ఘడియలనే ప్రామాణికంగా తీసుకుంటారని పంచాగ కర్తలు చెబుతున్నారు. నవంబర్ 12 వ తేది రాత్రి గడియల్లో అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

దీపావళి పండుగ ముహూర్తం వివరాలు

  • దీపావళి పండుగ తేది : 2023, నవంబర్ 12  ( ఆదివారం)
  • లక్ష్మీపూజకు అనువైన సమయం : నవంబర్ 12  సాయంత్రం 5:39 నుంచి 7:35 వరకు
  • అమావాస్య తిథి ప్రారంభం: నవంబర్ 12 మధ్యాహ్నం 2:44 నుంచి
  • అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 13 మధ్యాహ్నం 2:56 వరకు