
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగిర్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను అల్లకాస్ సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ అల్లక సత్యనారాయణ మాట్లాడుతూ, “అల్లకాస్ అనేది కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదు. ఇది హైదరాబాద్ ఫ్యాషన్ రూపురేఖలను కొత్త స్థాయికి తీసుకెళ్లే మైలురాయి” అని పేర్కొన్నారు. ఆకర్షించే కలెక్షన్లు, బ్రాండ్లతో కూడిన నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రత్యేకంగా వినియోగదారుల కోసం నిర్మించామని అన్నారు.
ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్, బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కమిషనర్ శరత్ చంద్ర హాజరయ్యారు. “ఇంతటి ఫ్యాషన్ కలెక్షన్లు మీరు ఎప్పుడూ చూడలేదు. ఇంత తక్కువ ధరలకు ఇలాంటి బట్టలు ఇండియాలో ఎక్కడా దొరకవు” అని సత్యనారాయణ పేర్కొన్నారు. అల్లకాస్ ఇప్పుడు హైదరాబాద్‌లో కుటుంబం మొత్తం షాపింగ్ చేయగలిగే షాపింగ్ డెస్టినేషన్ అని అన్నారు.