
- కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నయ్
- మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
- జేసీహెచ్ఎస్ఎల్ ఆఫీసులో స్వేచ్ఛకు సంతాప సభ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ జర్నలిస్టు, ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ స్వేచ్ఛ వొటార్కర్ సంతాప సభ మంగళవారం సొసైటీ ఆఫీసులో నిర్వహించారు. అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వేచ్ఛకు నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. స్వేచ్ఛ మరణానంతరం కొన్ని యూట్యూబ్ చానల్స్‌తో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు బాధను కలిగిస్తున్నాయన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయన్నారు. వ్యక్తిగత జీవితంలో చొరబడిన యూట్యూబ్చానల్స్తో పాటు సోషల్ మీడియా స్వేచ్ఛను మరోసారి చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరముందన్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ టీన్యూస్ సీఈఓ, సోసైటీ మాజీ కార్యదర్శి శైలేశ్‌రెడ్డి, కమలాకరాచార్య, ప్రభాకర్ రావు, మహేశ్వర్ గౌడ్, యోగానంద్, మారుతి సాగర్, బసవ పున్నయ్య, లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.