
మంచి కాన్సెప్టుల కోసం ఒకప్పుడు బాలీవుడ్, మాలీవుడ్‌ల వైపు చూసేవాళ్లు సినీ గోయర్స్. కానీ ఇప్పుడు తెలుగులోనూ అద్భుతమైన కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఇతర ఇండస్ట్రీవాళ్లు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో చాలా తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు ‘నాంది’ సినిమా కూడా రీమేక్‌కి రెడీ అయింది. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్‌తో పాటు ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా అందుకుంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211 ఆధారంగా నడిచే కథ ఇది. ఈ తరహా చిత్రాలకు బాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. అందుకే రీమేక్‌లో నటించేందుకు అజయ్ దేవగన్ ఓకే చెప్పాడు. తనతో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో రివీల్ చేయనున్నారు. ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’, రాజ్ కుమార్ రావ్‌తో 'హిట్' హిందీ రీమేక్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు దిల్ రాజు. 'నాంది' ఆయనకి హిందీలో మూడో సినిమా.