
E20 Petrol: కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై అనేక వార్తలు వస్తున్నాయి. ముందుగా కొన్ని ఇ20 ఇంధనం వల్ల ఇంజన్ డ్యామేజ్ అవుతుందని, మైలేజ్ దెబ్బతింటుందని, కంపెనీలు వారెంటీలు క్లెయిమ్ ఇవ్వవని వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై పూర్తి స్టడీ తర్వాతే ఇథనాల్ కలిపిన పెట్రోల్ రోలవుట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చక్కెర తయారీ సంస్థలకు ఇథనాల్ ఉత్పత్తిపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు పెద్ద ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో అసలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ దేశంలో ప్రమోట్ చేయటానికి కారణం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఫ్యామిలీలోని వ్యక్తుల వ్యాపారాల కోసం ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి కారణం గడ్కరీ కుమారుడు కూడా ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన కంపెనీ కలిగి ఉండటమే. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలపై గడ్కరీ స్పందించారు. ఇథనాల్ 20 శాతం కలిపిన పెట్రోల్ పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా తనపై జరిగిన పెయిడ్ క్యాంపెయిన్ అని గడ్కరీ చెప్పారు. కొందరు కావాలనే తనను రాజకీయంగా టార్గెట్ చేసినట్లు కేంద్ర రోడ్లు రవాణా మంత్రి చెప్పుకొచ్చారు.
ALSO READ : కేజీ వెండి రూ.లక్ష 50వేలు అవ్వటం పక్కా..
ఆటోమొబైల్ తయారీదారులు, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై తమ పరిశోధనలను ప్రభుత్వంతో పంచుకున్నాయని.. అన్నీ పరిశీలించాకే ముందుకెళుతున్నట్లు గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇథనాల్ కలపటం అనే నిర్ణయం క్రూడ్ దిగుమతులను తగ్గించటంతో పాటు ఖర్చుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో చేస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. సోషల్ మీడియాలో ఇథనాల్ కలిపిన ఇంధనంపై జరిగిన వ్యతిరేకపు ప్రచారం పూర్తిగా రాజకీయ కుట్రతో జరిగిన ఒక పెయిడ్ క్యాంపెయిన్ అని కొట్టిపడేశారు గడ్కరీ.