ఊర్వశివో రాక్షసివో’ స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది : అల్లు అర్జున్

ఊర్వశివో రాక్షసివో’ స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది :  అల్లు అర్జున్

‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌కే కాదు.. తమ ఫ్యామిలీ అందరికీ స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది అన్నాడు అల్లు అర్జున్. నవంబర్ 4న రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్‌‌ రావడంతో రీసెంట్‌‌గా హైదరాబాద్‌‌లో సక్సెస్  సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘ఈ సినిమా మాకు వెరీ స్పెషల్. దర్శకుడు రాకేష్ మాకు మంచి  హిట్ ఇచ్చాడు. నా సినిమా సక్సెస్ అయినా నేను ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో.. మా తమ్ముడు సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాన్నకు బిగ్ కంగ్రాచ్యులేషన్ చెప్పాలి. ఆయన నా సినిమాలు ఎన్నో చూశారు గాని, శిరీష్‌‌కు మంచి సక్సెస్‌‌ను ఇవ్వడం చాలా మెమొరబుల్‌‌గా ఉంటుంది. ఇక ‘పుష్ప’వన్ తగ్గేదే లే అయితే.. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదేలే. నేను కూడా ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్మెంట్‌‌తో  ఉన్నా’ అన్నాడు.

శిరీష్ మాట్లాడుతూ ‘ఏ రిలేషన్‌షిప్‌‌లో నైనా గివ్ అండ్ టేక్ ఉంటుంది. నాకు మాత్రం మా నాన్న ఇప్పటివరకు ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉన్నాడు. ఏం చేసినా.. ఏం సాధించినా ఆయన రుణం తీసుకోలేను. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. మా అన్నయ్య నన్ను తమ్ముడిలా చూడకుండా ఒక కొడుకులా చూస్తాడు. తనకు నేనంటే అంత ప్రేమ’ అని చెప్పాడు. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు,  దిల్ రాజు, ధీరజ్,  హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, తమ్మారెడ్డి భరద్వాజ కార్యక్రమంలో పాల్గొన్నారు.