నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి :  ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  •     ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

ఇంద్రవెల్లి, వెలుగు: నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లోని నాగోబాను శనివారం ఆయన దర్శించుకున్నారు. ఈనెల 18 నుంచి జరగనున్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జాతర దర్బార్​కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వస్తున్నారని చెప్పారు. వచ్చే జాతరకల్లా రూ.15 కోట్లతో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తామన్నారు. అంతకుముందు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ స్కూల్​లో సీఎం కప్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ఆయా కార్యక్రమాల్లో డీడీ అంబాజీ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, ఏటీడబ్ల్యూవో సదానందం, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ చైర్మన్ మెస్రం ఆనందరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, ఏంఈవో మణుకుమార్, ఇంద్రవెల్లి సర్పంచ్ మోహన్ సింగ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ జహీర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు..

రక్త దానంతో నిండు ప్రాణాన్ని కాపాడగలం

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వల్ల నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్లమవుతామని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం హస్నాపూర్ లో జేసీఎన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.