బన్నీ, భన్సాలీ కాంబోలో మూవీ!

బన్నీ, భన్సాలీ కాంబోలో మూవీ!

ముంబై: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో తెలిసిందే. ముఖ్యంగా హిందీ సర్క్యూట్స్ లో ఈ చిత్రం బిగ్ సక్సెస్ సాధించింది. డబ్బింగ్ సినిమాగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. దీంతో ఉత్తరాది ప్రేక్షకుల్లో బన్నీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడితో సినిమాలు తీసుకునేందుకు బాలీవుడ్ బడా నిర్మాతలు, డైరెక్టర్లు ఎగబడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmfare (@filmfare)

ఇదిలా ఉండగా.. హిందీలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముంబైలోని భన్సాలీ ఆఫీసుకు బన్నీ వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మెగా ప్రాజెక్టుకు చర్చలు జరిగాయని.. మూవీ కూడా ఫిక్స్ అయ్యిందని పుకార్లు వస్తున్నాయి. దీంట్లో ఎంత నిజముందో తెలీదు. కానీ పుష్పతో బంపర్ హిట్ కొట్టిన బన్నీ.. రీసెంట్ గా ‘గంగూబాయి కతియావాడీ’తో ఆకట్టుకున్న భన్సాలీ కాంబోలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ మరోసారి షేక్ కావాల్సిందే. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భన్సాలీతో మాస్ క్యారెక్టర్లతో అలరించే బన్నీ సినిమా ఫిక్స్ అయితే డిఫరెంట్ సినిమాను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్ న్యూస్ వచ్చే దాకా ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో మరిన్ని చర్చలు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. 

మరిన్ని వార్తల కోసం:

‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ 

సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్