చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ 

చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ 

చెన్నై: ఈ ఏడాది నిర్వహించే చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఒలింపియాడ్ రష్యాలో జరగాల్సి ఉండగా.. ఉక్రెయిన్ పై ఆ దేశం యుద్ధం నేపథ్యంలో టోర్నీని ఫిడె అక్కడి నుంచి భారత్ లోని చెన్నైకి తరలించింది. ఒలింపియాడ్ ఆతిథ్యం కోసం తొలుత ఫిడె బిడ్ లు దాఖలు చేయొచ్చని ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వహణ హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) బిడ్ దాఖలు చేసింది. ఇందుకు సుమారు రూ.75 కోట్లు (10 మిలియన్ డాలర్లు) హామీ మొత్తాన్ని ఫిడెకు సమర్పించింది. అనంతరం బిడ్స్ ను పరిశీలించిన ఫిడె.. మిగతా దేశాలను కాదని భారత్ వైపు మొగ్గు చూపింది. ఈ టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. జూలై చివర్లో ప్రారంభమై ఆగస్టులో పూర్తయ్యేలా షెడ్యూల్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. రెండు వారాల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 190 దేశాల జట్లు బరిలో దిగుతాయి. 

మరిన్ని వార్తల కోసం:

సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్

ఝులన్ గోస్వామి కొత్త రికార్డు

పల్లెల్లో జాజిరి.. జాజిరి