AA22xA6: అల్లు అర్జున్ రూ.800 కోట్ల ప్రాజెక్టుపై హైద‌రాబాద్‌కు అట్లీ.. ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

AA22xA6: అల్లు అర్జున్ రూ.800 కోట్ల ప్రాజెక్టుపై హైద‌రాబాద్‌కు అట్లీ.. ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

సౌత్ అండ్ నార్త్ లోనే కాదు..వరల్డ్ వైడ్ సినీ ఇండస్ట్రీలు అల్లు అర్జున్ 22వ మూవీ కోసం ఎదురుచూన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోన్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ అట్లీ నేడు బుధ‌వారం (మే21న) హైద‌రాబాద్ వ‌చ్చారు.

అట్లీ హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం దర్శకుడు అట్లీ హైదరాబాద్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫోటోలు చూసిన ఐకాన్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ.. 'మీ మేకింగ్ స్టైల్ కోసం వెయిటింగ్ అన్న' అని పోస్టులు పెడుతున్నారు. 

ఇటీవలే ఈ సినిమా గురించి అట్లీ మాట్లాడుతూ, ఇది తన కలల ప్రాజెక్ట్ అని, "నేను ఎప్పట్నుంచో తీయాలని కలలు కంటున్న సినిమా ఇది. ఈ మూవీ స్క్రీన్‌ప్లేని అద్భుతంగా మలచడానికి సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పని చేశాను" అని అట్లీ ఒక ప్రకటనలో తెలిపారు. దీన్నీ బట్టి అర్ధం చేసుకోవొచ్చు అట్లీ ఎలాంటి ఖచ్చితమైన ప్రణాళికతో వస్తున్నాడని. 

పలు నివేదికల ప్రకారం, అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్ర హీరో, రెండవది విలన్, మరియు మూడవది పూర్తి నిడివి గల యానిమేటెడ్ పాత్ర. ఒక ఇండియాన్ యాక్టర్ తువంతయి భారీ బడ్జెట్ చిత్రంలో ఈ పాత్రను ప్రయత్నించడం ఇదే మొదటిసారి. దీనికోసం స్పెషల్ ట్రైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టుకుని కసరత్తులు చేస్తున్నాడు బన్నీ.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రూపొందుతోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్ ‌‌భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ఇందులో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండేలను ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలో క్లారిటీ రానుంది.