అల్లు అర్జున్‭ని వరించిన జి క్యూ మెన్ మ్యాగజైన్ 2022 అవార్డు

అల్లు అర్జున్‭ని వరించిన జి క్యూ మెన్ మ్యాగజైన్ 2022 అవార్డు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‭కి అరుదైన గౌరవం దక్కింది. స్టైలిష్ స్టార్ కు జి క్యూ మెన్ మ్యాగజైన్ 2022 ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్వయంగా ఈ బృందం హైదరాబాద్ వచ్చి అల్లుఅర్జున్ కి అందజేశారు. లీడింగ్ మాన్ టైటిల్‭తో బన్నీని గౌరవించింది. ఫలక్ నుమా ప్యాలెస్‭లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి ఈ అవార్డుని బన్నీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్పది రైజ్ సినిమా చేసినప్పటి నుండి ఆయన కెరియర్ అనూహ్య మలుపు తిరిగింది. పుష్ప సినిమా కారణంగా పాన్ ఇండియా హీరోగా బన్నీకి గుర్తింపు వచ్చింది. దాని కంటే ముందు కూడా జాతీయంగా బన్నీకి మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమా కారణంగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

ఇక రష్యాల్లో విడుదలైన పుష్ప సినిమా ఇటీవల ఫిలింఫేర్ సౌత్ లో చాలా పురస్కారాలను అందుకుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఇక పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప ద రూల్ సినిమా విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.