
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో అరుదైన గౌరవాన్నిదక్కించుకోనున్నారు. పుష్ప(Pushpa) సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఇటీవలే నేషనల్ అవార్డు అందుకున్న ఈ స్టైలీష్ స్టార్.. ఇప్పుడు మరో ప్రత్యేకమైన గౌరవానికి ఎంపికయ్యారు. లండన్ లోని ప్రముఖ మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో త్వరలో కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఆ లిస్టులో ఇప్పుడు అల్జు అర్జున్ కూడా చోటు దక్కించుకోనున్నారు.
ఇందుకోసం త్వరలోనే లండన్ వెళ్లనున్న అల్లు అర్జున్.. మైనపు విగ్రహం తయారుచేయడానికి కావాల్సిన కొలతలను ఇవ్వడంతో పాటు.. మ్యూజియంను కూడా సందర్శించనున్నారు. ఇక దక్షిణాది నుండి ఇప్పటికే.. ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
Also Read : ఏడు పులి పిల్లలు.. వరసగా చనిపోయాయి.. ఈ వైరస్ అంత ప్రమాదకరమా..!
అల్లు అర్జున్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమా చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.