Allu Arjun: ‘పుష్ప 2’ సంచలనానికి ఏడాది.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఆ ఒక్కటి కూడా గుర్తుచేస్తే బాగుండు!

Allu Arjun: ‘పుష్ప 2’ సంచలనానికి ఏడాది.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ఆ ఒక్కటి కూడా గుర్తుచేస్తే బాగుండు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ పుష్ప2 : ది రూల్ (Pushpa 2: The Rule). బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించిన పుష్ప 2 రిలీజై.. ఇవాళ్టితో (డిసెంబర్ 5) ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సెట్లో దర్శకుడు సుకుమార్తో కలిసి ఉన్న ఫోటో పంచుకుంటూ సినిమా విశేషాలు పంచుకున్నారు. 
 
‘‘పుష్ప మూవీ.. మా జీవితంలో మరపురాని ఐదు సంవత్సరాల ప్రయాణం. మేం క్రియేట్ చేసిన పుష్ప ప్రపంచంలోకి ప్రేక్షకులు లోతుగా మునిగిపోవడం మా అదృష్టం. వారి అపారమైన ప్రేమ, మాకిచ్చిన బలం మరియు ధైర్యం మమ్మల్ని ఎంతో ముందుకు నడిపింది. పుష్ప సినిమాని అద్భుతంగా ఆదరించిన దేశ, విదేశ ప్రేక్షకుల అందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. నా టెక్నీషియన్స్తో పాటుగా, మొత్తం యూనిట్, నిర్మాతలు, పంపిణీదారులు మరియు మా కెప్టెన్ సుకుమార్.. వంటి క్రియేటివ్ టీమ్తో కలిసి ప్రయాణం చేయడం నాకు గౌరవంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఐకాన్ ఫ్యాన్స్ను మాత్రమే కాదు.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. ఇదే 'పుష్ప 2 ప్రీమియర్స్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్, అతని కుటుంబాన్ని గుర్తుచేస్తే  కూడా బాగుండు' అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే, అల్లు అర్జున్ గుర్తు చేయకపోయినప్పటీకీ.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రూ.2 కోట్ల ఫిక్స్​డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీతేజ తండ్రి భాస్కర్​కు అందిస్తున్నారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు 6 నెలలు కాదు మరో ఏడాది అయినా సరే.. అల్లు అర్జున్ అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు తాజాగా దిల్ రాజు ప్రకటించడం గమనార్హం!

పుష్ప 2 కలెక్షన్స్:

దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ మూవీ రూ.1228 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పుష్ప 2 సత్తా చాటింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో పుష్ప 2 నిలిచింది.