అల్లు ముద్దుల కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్: అర్హతో బ్యూటీఫుల్ మూమెంట్స్ షేర్ చేసిన స్నేహారెడ్డి

అల్లు ముద్దుల కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్: అర్హతో బ్యూటీఫుల్ మూమెంట్స్ షేర్ చేసిన స్నేహారెడ్డి

అల్లు అర్జున్ స్వీట్ డాటర్ అల్లు అర్హ (Allu Arha) తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. తన ముద్దు ముద్దు మాటలు, అల్లరి చేష్టలతో ఇప్పటికే సోషల్​ మీడియాలో బోలెడంతమంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సంపాదించుకుంది. ఇటీవల (2025 నవంబర్ 21న) అల్లు అర్హ పదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అర్హ తన పుట్టినరోజును దుబాయ్‌లో గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంది.

లేటెస్ట్గా బన్నీ భార్య స్నేహరెడ్డి.. కూతురు అల్లు అర్హ బర్త్ డే వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్హపై ఉన్న ఉప్పెనంత ప్రేమను బ్యూటీఫుల్ క్యాప్షన్తో స్నేహ పంచుకుంది. 

“తొమ్మిది సంవత్సరాల గ్రేస్, స్వీట్‌నెస్, అత్యంత మ్యాజికల్ ఆరా.. వాటర్లో సరదాగా గడపడం, కేకులు, మాల్‌లో షాపింగ్ - నిన్ను సెలబ్రేట్ చేసుకోవడం నాకెంతో స్వచ్ఛమైన ఆనందం ఇచ్చింది. మై బేబీ గర్ల్.. నువ్వు నా ప్రతి క్షణాన్ని మెరిసేలా చేస్తావు” అనే క్యాప్షన్తో స్నేహ తన స్పెషల్ మూమెంట్స్ను షేర్ చేసింది.

అల్లు అర్జున్ సైతం ‘హ్యాపీ బర్త్ డే మై లిటిల్ ప్రిన్సెస్.. నా అంతులేని సంతోషానికి కారణం నీవే’ అని బ్యూటీఫుల్ క్యాప్షన్తో విషెస్ అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఐకాన్ ఫ్యాన్స్ను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్హకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్హ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. సమంత నటించిన శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసింది. ఈ సినిమాలో అర్హ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు

యంగెస్ట్ చెస్ ట్రైయినర్‌గా నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్:

అల్లు అర్హ చదరంగం ఆటలో అద్భుతంగా రాణిస్తోన్న విషయం తెలిసిందే. నాలుగున్నర సంవత్సరాల వయసులోనే అర్హ వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డును సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంది. ‘నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. 30కి పైగా చెస్ పజిల్స్ పూర్తి చేయడమే కాకుండా 50 మందికి శిక్షణ ఇవ్వడంతో.. యంగెస్ట్ చెస్ ట్రైయినర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. 

అల్లు అర్జున్ సినిమాలు:

ప్రస్తుతం అల్లు అర్జున్, బ్లాక్‌ బస్టర్ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేస్తున్నాడు. 'AA22xA6 ' అనే వర్కింగ్ టైటిల్‌ తో భారీ సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్పతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. జవాన్తో అట్లీ దర్శకుడిగా తన సత్తాను దేశవ్యాప్తంగా నిరూపించుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికతో సినిమా ప్రపంచంలో కొత్త సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ఈ నాలుగు పాత్రలు ఒకే కుటుంబానికి చెందిన పాత్రలు అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత పుష్ప 3లో నటించే ఛాన్స్ ఉంది.