పోలీసుల్ని పోలీసులే పట్టుకోవాల్సి వస్తే..

పోలీసుల్ని పోలీసులే పట్టుకోవాల్సి వస్తే..

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో  తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌‌‌‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదల. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కి అతిథిగా హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని  ‘లింగిడి లింగిడి’ సాంగ్ ప్రతి ఒక్కరి మైండ్‌‌‌‌లోకి, హార్ట్‌‌‌‌లోకి వెళ్లి కూర్చుంది.  

ఈ పాట సినిమాకు అద్భుతమైన ప్లస్. సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది.  ఇక సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఇందులో చూపిస్తున్నారు. అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి’ అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘పోలీసులని పోలీసులే పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ ఇది. పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనేది చూపించాం. 

ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్‌‌‌‌ని ఉద్దేశించి తీయలేదు’ అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఒక మంచి కాన్సెప్ట్‌‌‌‌తో తీసిన కమర్షియల్ ఫిల్మ్ ఇది.  మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.  గీతా ఆర్ట్స్‌‌‌‌లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అని చెప్పారు రాహుల్, శివాని. ఇప్పుడున్న సిస్టమ్‌‌‌‌లో పొలిటీషియన్స్ చేతిలో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది చూపిస్తున్నాం అని చెప్పాడు తేజ మార్ని. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందన్నారు బన్నీ వాస్. సాయి రాజేష్​, ఎస్‌‌‌‌కేఎన్ పాల్గొన్నారు.