మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్టూడెంట్లు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇన్‌‌చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్‌‌ కప్ పోటీలను  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో  ఆది, సోమ వారాల్లో  కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, షాట్ ఫుట్  పోటీలను నిర్వహించామని చెప్పారు.  గ్రామస్థాయిలో గెలుపొందిన వారిని మండల స్థాయికి, మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేసి మంగళ, బుధవారాల్లో  పోటీలు జరుపుతున్నామని వివరించారు.  విజేతలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా షీల్డులు అందజేస్తామన్నారు.

మంత్రిపై గవర్నర్‌‌‌‌కు ఫిర్యాదు

నారాయణపేట, వెలుగు:  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నె 13న 20 వేల మంది స్టూడెంట్ల మధ్య గాల్లోకి కాల్పులు జరిపిన ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌పై  చర్యలు తీసుకోవాలని బలరామ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు శివవీర్ రెడ్డి డిమాండ్ చేశారు.  మంగళవారం గవర్నర్ తమిళిసై, డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి గన్‌‌ పేల్చడం ఏంటని ప్రశ్నించారు.   పైగా ప్రెస్‌‌మీట్‌‌ పెట్టి ఇష్టం వచ్చినట్లు సిగ్గుచేటన్నారు. మంత్రిపై ఆర్మ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీలోకి 200 మంది   

వనపర్తి, వెలుగు:  వనపర్తికి చెందిన  తెలుగు మత్సకార సంఘం పట్టణ అధ్యక్షుడు నందిమల్ల రవితో పాటు 250 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మంగళవారం మేడ్చల్‌‌ జిల్లా శామీర్ పేటలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, బి. కృష్ణ , జిల్లా ప్రధాన కార్యదర్శి డీ. నారాయణ,మాధవ రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధి బచ్చు రాము,సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి పరుశురాం పాల్గొన్నారు.   

బతకాలని లేదు

సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య 

కందనూలు, వెలుగు:  ‘ఎందుకో కాని బతకాలని లేదు.. నాకంటూ మరో ఆశ లేదు.. ఎవరినీ అనుమానితులుగా చూడవద్దు..  ఇష్టపూర్వకంగా చనిపోతున్న..  నా డెడ్‌‌బాడీని `సమాధి చేయండి’ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట గ్రామానికి చెందిన మూడవత్ కిషన్ నాయక్ (19) తండ్రి ఆరేళ్ల క్రితం, తల్లి మూడు నెలల క్రితం చనిపోయారు. ఇద్దరు అక్కలు ఉండగా పెళ్లిళ్లు అయిపోయాయి. దీంతో హైదరాబాద్‌‌ వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన అతను ఓ అక్కతో రాఖీ కట్టించుకున్నారు. మరో అక్క మంగళవారం వస్తానని చెప్పడంతో సోమవారం రాత్రి ఒక్కడే ఇంట్లో పడుకున్నాడు.  ఉదయం ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు  కిటికీలోంచి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సూసైడ్‌‌ దొరికిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

పాలమూరులో కవులకు కొదవ లేదు

పాలమూరు, వెలుగు: పాలమూరులో కవులు, కళాకారులకు కొదవ లేదని జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం జడ్పీ మీటింగ్‌‌ హాల్‌‌లో  ‘స్వాతంత్ర్య స్ఫూర్తి- వజ్రోత్సవ దీప్తి’  అంశం పై నిర్వహించిన కవి సమ్మేళనానికి చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు.  స్వయంగా కవయిత్రి కూడా అయిన ఆమె ఈ సందర్భంగా కవిత చదివి వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్‌‌‌‌ జిల్లా  సాహితీరంగంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందన్నారు. వేల మంది కవులు, కళాకారులు ఉన్నాయని,  ఈ మధ్య  కవయిత్రుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందన్నారు.  జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, అడిషనల్‌‌ కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఆర్వో  వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, డీఎస్వో వనజాత, వెల్ఫేర్ ఆఫీసర్లు శంకరా చారి, ఇందిర  పాల్గొన్నారు.  

స్వాతంత్ర్య ఉద్యమంలో కవుల పాత్ర కీలకం 

గద్వాల, వెలుగు: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కవుల పాత్ర కీలకమని,  వారి రచనలతో ప్రజలను చైతన్యవంతం చేశారని గద్వాల జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ సరిత చెప్పారు.  మంగళవారం బాలభవన్‌‌లో నిర్వహించిన ‘స్వాతంత్ర్య స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి’  కవి సమ్మేళనానికి కలెక్టర్‌‌‌‌  వల్లూరు క్రాంతితో కలిసి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా  43 మంది కవులు తమ కవిత్వాలను వివరించారు.  అనంతరం వారిని  శాలువాలతో సన్మానించి ప్రశంస పత్రాలు అందించారు. 

ఓర్వలేకనే టీఆర్ఎస్‌‌ గుండాల దాడులు

నారాయణపేట, అయిజ, మక్తల్, అమ్రాబాద్, పెద్దమందడి, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ఆదరణ ఓర్వలేకనే టీఆర్‌‌‌‌ఎస్‌‌ గుండాలు రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెగుతుంటే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు.  టీఆర్‌‌‌‌ఎస్‌‌ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిచండం సిగ్గుచేటన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, మరింత ఉత్సాహంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.  దాడి చేసిన  వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయా కార్యక్రమాల్లో  బీజేపీ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకుడు కొండయ్య, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లా కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, నేతలు కర్ని స్వామి, నరసింహారెడ్డి, వెల్టార్ రమేశ్, ఆపిరెడ్డిపల్లి రాము, గోపాల్ యాదవ్,   వెంకటేశ్ యాదవ్, నరసింహయ్యశెట్టి, శేఖర్, ప్రదీప్ పాల్గొన్నారు.

గ్రామాల్లో పనులను పెండింగ్ పెట్టొద్దు

మదనాపురం, వెలుగు: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్‌‌లో పెట్టొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం మదనాపురం మండల పరిషత్ ఆఫీసులో మంగళవారం ఎంపీపీ జన్ను పద్మావతమ్మ అధ్యక్షతన నిర్వహించిన జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌కు  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డితో కలిసి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు గ్రామాల్లో అనేక పనులు పెండింగ్‌‌లో ఉన్నాయని, చేసిన వాటికి బిల్లులు ఇవ్వడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు, శానిటేషన్‌‌ విషయంలో ప్రభుత్వం స్పెషల్ ఫోకస్‌‌ పెట్టిందన్నారు. ప్రతి గ్రామానాకి బీటీ రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు పూర్తి చేసిన సభ్యులకు వెంటనే బిల్లులు రిలీజ్‌‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రవణ్ రెడ్డి, పీఏసీఎస్‌‌ చైర్మన్ వంశీదర్ రెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో నాగేందర్, వైస్ ఎంపీపీ యాదమ్మ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేవి అన్నీ అబద్ధాలే

అమనగల్లు, వెలుగు:  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌‌ యాదవ్ అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి విమర్శించారు.  సోమవారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, తలకొండపల్లి–ఆమనగల్లు రోడ్డు విస్తరణకు రూ. 31 కోట్ల,  మున్సిపాలిటీకి రూ. 32 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే తానే మంజూరు చేయించానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోర్టును కూడా తానే మంజూరు చేయించానని  చెబుతున్నారని, కోర్టుల అంశం ప్రభుత్వ పరిధిలో ఉండదన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.  సురసముద్రం మినీ ట్యాంక్ బండ్‌‌ పనులు ఇంకా ఎందుకు పెండింగ్‌‌లో ఉన్నాయో చెప్పాలన్నారు.  మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు విక్రం రెడ్డి, చెన్నకేశవులు నాయకులు రాం రెడ్డి,  నరసింహ, శ్రీకాంత్ సింగ్, రాములు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌ కౌన్సిలర్లపై వివక్ష

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌‌ కౌన్సిలర్లపై వివక్ష చూపుతున్నారని 7వ వార్డు కౌన్సిలర్​ నూరి బేగం ఆరోపించారు. మంగళవారం వార్డులో నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పదవి చేపట్టి  ఏడాది గడుస్తున్నా వార్డులో ఒక్కపని కూడా కాలేదన్నారు.  నామమాత్రంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని, సమస్యలు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కమిషనర్ దీక్ష స్థలికి చేరుకొని కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కొబ్బరి బొండం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​కౌన్సిలర్లు గౌరీశంకర్, శారద,  నేతలు గోపాల్​ రెడ్డి, రామనాథం, ఖాదర్​ పాల్గొన్నారు. 

నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కల్వకుర్తి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్‌‌ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, హైరిస్క్‌‌ డెలివరీల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ డాక్టర్లు, నర్సులను ఆదేశించారు.  మంగళవారం   కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసీఆర్‌‌‌‌ కిట్‌‌ను మరింత మెరుగు పరిచి కేసీఆర్‌‌‌‌ న్యూట్రిషన్‌‌ కిట్‌‌ను ప్రారంభించనుందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ డెలివరీలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్‌‌‌‌వైజర్లు ఏం చేస్తున్నారని ప్రశించారు. గర్భిణుల విషయంలో నర్సులు, సిబ్బంది స్పెషల్ కేర్ తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీలు జరిగేలా చూడాలని  సూచించారు.  హైరిస్క్‌‌ డెలివరీ కేసుల కోసం  ప్రతి ఆస్పత్రిలో 10 బెడ్లు  కేటాయించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో సుధాకర్ లాల్,  సీహెచ్‌‌సీ డాక్టర్లు‌‌ శివరాం, రమేష్, చంద్ర, యశోద, సిబ్బంది పాల్గొన్నారు.