అమెరికాలో అప్పుడే 6 కోట్ల మంది ఓటేసిన్రు

అమెరికాలో అప్పుడే 6 కోట్ల మంది ఓటేసిన్రు

6 కోట్ల మంది ఓటేసిన్రు

గత ఎన్నికలతో పోలిస్తే అమెరికాలో పెరిగిన ముందస్తు ఓటింగ్

మెయిల్ ఇన్ ఓటింగ్‌‌కు ఫుల్ రెస్పాన్స్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆదివారం నాటికి 5.87 కోట్ల మందికి పైగా ఓటేశారు. ముందస్తు ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూఎస్ కు చెందిన ఎడిసన్ రీసెర్చ్ అండ్ క్యాటలిస్ట్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2016లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్ తో పోలిస్తే ఈసారి ముందస్తు ఓటింగ్ పెరిగింది. 2016లో మొత్తం 5.83 కోట్ల మంది ఎర్లీ ఓటింగ్ లో పాల్గొనగా, ఈసారి పోలింగ్ కు మరో 9 రోజులు ఉండగానే 5.87 కోట్ల మందికి పైగా ఓటు వేశారని సీఎన్ఎన్ తెలిపింది. కరోనా కారణంగా చాలామంది మెయిల్ ఇన్ బ్యాలెట్లతో పాటు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తున్నారని చెప్పింది. మెయిల్ ఇన్ ఓటింగ్ కు మంచి స్పందన వస్తోందంది. అయితే మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కువగా నమోదవుతుండడంతో ఎలక్షన్ రిజల్ట్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రెసిడెంట్ గెలుపులో ముందుగా పోలైన ఓట్లే కీలకం కానున్నాయని చెప్పింది. నవంబర్ 3న యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరఫున జో బిడెన్ పోటీలో ఉన్నారు.

16 రాష్ట్రాల్లోనే సగం…

ఈ ముందస్తు ఓటింగ్ లో 54% 16 రాష్ట్రాల్లోనే నమోదైందని సీఎన్ఎన్ తెలిపింది. ప్రెసిడెంట్ గెలుపులో ఇవి కీలకం కానున్నాయని పేర్కొంది. మొత్తంగా మిన్నెసొటా రాష్ట్రంలో ముందస్తు ఓటింగ్ ఎక్కువగా నమోదైందని చెప్పింది. ఫ్లోరిడాలో ఇప్పటికే ఓటేసిన 35% మందిలో 71% మంది జో బిడెన్ కు, 27% మంది ట్రంప్ కు మద్దతు తెలిపారు.  మొత్తంగా 70% మంది డెమొక్రాట్స్, 20% మంది రిపబ్లికన్లు ముందస్తు ఓటింగ్ లో పాల్గొన్నారని వెల్లడైంది.

ఓటేసిన ట్రంప్

ఎన్నికలకు 10 రోజుల ముందుగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో శనివారం ఆయన ఓటేశారు. అనంతరం ‘‘ట్రంప్ అనే వ్యక్తికి నేను ఓటేశాను” అని ట్రంప్ చెప్పారు.

For More News..

ఫ్యూచర్ గ్రూప్ –రిలయన్స్‌‌ మధ్యలో అమెజాన్​!

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలుసు

నాపై దాడి చేయిస్తవా? కేసీఆర్​.. నీ సంగతి తేలుస్తా!