
కన్నడ నటుడే అయినా తెలుగు సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్. తను హీరోగా నటించిన ‘కె3’ మూవీ గతేడాది కన్నడలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ‘కె3 కోటికొక్కడు’ పేరుతో శ్రేయాస్ మీడియాస్, గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. శివ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుదీప్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్ హీరోయిన్స్. రవి శంకర్, నవాబ్ షా ఇతర పాత్రలు పోషించారు. కన్నడలో సూపర్ సక్సెస్ సాధించి దాదాపు నలభై కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. దీంతో పాటు ‘విక్రాంత్ రోణ’ అనే ప్యాన్ ఇండియా మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు సుదీప్. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేస్తున్నారు.