
బాలీవుడ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసినా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది జెనీలియా. 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడిన తర్వాత పర్సనల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది. అలాగని నటనకు దూరమైపోలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది. కానీ ఇప్పుడు హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తన భర్తతో కలిసి ‘మిస్టర్ మమ్మీ’ అనే మూవీ చేస్తోంది జెనీలియా. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్. షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్నాడు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, షాద్ అలీ, శివ అనంత్ నిర్మిస్తున్నారు. నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో జెనీలియాతో పాటు రితేష్ కూడా ప్రెగ్నెంట్‌గా ఉండటం చూస్తుంటే ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తోంది. మూవీ మొత్తం హిలేరియస్‌గానే ఉంటుందని టీమ్ చెబుతోంది. నిజానికి జెనీలియా ఫస్ట్ మూవీలో రితేషే హీరో. ఇప్పుడు రీ ఎంట్రీ మూవీలో కూడా తన భర్తే హీరో కావడం చాలా ఆనందంగా ఉందంటోంది జెనీలియా. మరి ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.