హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరు డిసెంబర్ 1, 2025న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా నుంచి సాధారణ సినీ ప్రేక్షకుడి వరకు సమంత పెళ్లి వార్తలపైనే ఇంట్రెస్ట్ పెట్టారు. అందులోనూ వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం, పెళ్ళైన మూడు రోజులకే సమంత షూటింగ్ పనుల్లో బిజీ అవ్వడం వంటి అప్డేట్స్ కొత్తగా వినిపిస్తునే ఉన్నాయి. అంతేకాకుండా పాత వీడియోలు, స్పీచ్లు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సమంతతో పాటుగా తన మాజీ అత్తగారు అమల అక్కినేని ఉండటంతో ఆ వీడియో విశేషత సంతరించుకుంది.
జీ తెలుగు ఛానెల్ (2025 మే) నెలలో నిర్వహించిన సినిమా అవార్డ్ ఫంక్షన్ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్‌లో సమంతతో పాటుగా అమల ఫంక్షన్కి హాజరయ్యారు. అయితే.. సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జీ తెలుగు ఛానల్ సమంతని సన్మానిస్తూ తన కెరీర్‌లో ఈ మైలురాయిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది.
ఈ సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీపై సమంత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. " తెలుగు సినిమా పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది.. ఇదే నా కర్మ భూమి. తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను" అంటూ సమంత భావోద్వేగంగా మాట్లాడింది.
ఇక ఇదే ఈవెంట్‌కు హాజరైన అక్కినేని అమల.. సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. ఈ క్రమంలోనే సమంత- అమల కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత నటిగా, నిర్మాతగా రాణిస్తుంది. తన భర్త రాజ్ దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో నటిస్తుంది. అలాగే, నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘మా ఇంటి బంగారం’లోనూ నటిస్తుంది. త్వరలోనే మూవీ స్టార్ట్ అవ్వనుంది. ఇకపోతే.. 2017లో నాగచైతన్యతో సమంత వివాహం జరగగా, 2021లో ఈ జంట విడిపోయిన విషయం తెలిసిందే.
