అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలిక నిలిపివేత

అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలిక నిలిపివేత

అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. దీంతో వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు కుదుట పడిన తర్వాత  మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

జూన్‌ 28 నుంచి 56 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఏప్రిల్‌ 15నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఏటా జరిగే అమర్‌నాథ్ యాత్ర అప్పట్లో నెలకొన్న అసాధారణ పరిస్థితులతో గత రెండేళ్లుగా జరగలేదు. 2019లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో నెలకొన్న పరిస్థితులు కారణం కాగా.. 2020లో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా  యాత్రను రద్దుచేశారు బోర్డు అధికారులు.