జమ్మూ బేస్​ క్యాంప్  నుంచి అమర్​నాథ్​కు 4 వేల మంది

జమ్మూ బేస్​ క్యాంప్  నుంచి అమర్​నాథ్​కు 4 వేల మంది

జమ్మూ: మూడు రోజుల విరామం తర్వాత అమర్​నాథ్​ యాత్ర మళ్లీ మొదలైంది. దీంతో జమ్మూ బేస్​ క్యాంపు నుంచి 4,026 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. భారీ వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్దిరోజుల క్రితం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. ఇప్పటికీ 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియలేదు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు చక్కబడటంతో సోమవారం యాత్రను తిరిగి ప్రారంభించారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆర్మీ రెడీ చేసింది.

ఏపీకి చెందిన ఇద్దరు మహిళా భక్తుల మృతి

అమర్​నాథ్​ యాత్ర సందర్భంగా వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఇద్దరు భక్తులు మరణించినట్టు అధికారులు తెలిపారు. వీరిద్దరినీ రాజమండ్రికి చెందిన కొత్త పార్వతి, మునిశెట్టి సుధగా గుర్తించారు. వారి మృతదేహాలను స్వస్థలానికి తరలిచేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.