
జమ్మూ: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సాగే అమర్ నాథ్ యాత్ర తేదీలు ఆదివారం ఖరారయ్యాయి. ఈ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుందని శ్రీ అమర్ నాథ్ పుణ్య క్షేత్రం బోర్డు (ఎస్ ఏఎస్ బీ) తెలిపింది.
యాత్ర జూన్ 29న ప్రారంభం అయ్యి, ఆగస్టు 19న పూర్తి కానుందని చెప్పింది. అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభం అవుతాయని పేర్కొంది. అమర్ నాథ్ యాత్ర అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గామ్, గందర్‌బల్ జిల్లాలో బల్తాల్ మార్గం గుండా కొనసాగనుంది.