గుడ్ న్యూస్.. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లలో అమెజాన్ షాపింగ్ చేయొచ్చు.,

గుడ్ న్యూస్.. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లలో అమెజాన్ షాపింగ్ చేయొచ్చు.,

మెటా యాజమాన్య యాప్ లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ కోసం కొత్త ఇన్ యాప్ షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ వినియోగదారులు యాప్ లను వదలకుండా ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా కొనుగోళ్లు చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ యునైటెడ్ స్టేట్స్ లోని కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలో ఇండియాలో కూడా అందుబాటులో వస్తుంది. 

ఫీచర్ గురించి తెలుసుకోవాల్సినవి.. 

ఇది మొదటి సారి ప్రవేశపెడుతున్న ఫీచర్.. యునైటెడ్ స్టేట్స్  కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు ఒరిజనల్ ధరలను  చూపుతుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం చేయబడిన , ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అదనంగా ఉత్పత్తులు అమెజాన్ లేదా దాని స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. 

ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ ఖాతాను వారి అమెజాన్ ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ను నెట్ వర్క్ లను వదలకుండా ఉత్పత్తి ప్రకటననుంచి అమెజాన్ లో సెర్చ్ చేయొచ్చు. చివరగా అమెజాన్ నుంచి కొనుగోలుదారుల డీఫాల్ట్ షిప్పింగ్ అడ్రస్ మరియు చెల్లింపుల వివరాలతో కొనుగోలు చేయొచ్చు.